శాసనసభ్యులు కుందూరు కు వినతి పత్రాన్ని అందజేసిన ఉపాధ్యాయ సంఘాలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.
బుధవారం నాడు పొదిలి మండల పర్యటనలో ఉన్న శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కలిసిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు పెమ్మని బాల వెంకటేశ్వర్లు, షేక్ అబ్దుల్ హై,ఎం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిఓ నెంబర్ 117 ను సవరణ చెయ్యాలని, ప్రాథమిక పాఠశాల విలీనం నిలుపుదల చేయాలని, తెలుగు,ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని, సిఫార్సు బదిలీలను నిలిపి వేయాలని, బదిలీ ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చెయ్యాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు యుటిఎఫ్ నాయకులు వి ఎస్ కే రాజేశ్వరరావు, బాల కాశిరెడ్డి,
గోనె శ్రీనివాసులు, ఎం నాగార్జున రావు, చవలం వెంకటేశ్వర్లు, బి బుజ్జిబాబు, పోలూ శ్రీనివాస్ రెడ్డి, కాసు తిరుపతిరెడ్డి, సింగంపల్లి సుబ్బారావు, వెన్నెల మల్లికార్జునరావు, పి ఆంజనేయ చౌదరి, ఎం శివారెడ్డి , ఎం.వి. శ్రీనివాసరావు, మునగ జై కృష్ణ ,డి నారాయణ రెడ్డి సీతారామయ్య సిహెచ్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు