18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వెయ్యాలని తెలుగు దేశం పార్టీ నిరసన దీక్ష
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వెయ్యాలని తెలుగు దేశం పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.
వివరాల్లోకి వెళితే తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు శనివారం నాడు పొదిలి పట్టణంలోకి వివిధ ప్రాంతాల్లో తెలుగు దేశం పార్టీ నాయకులు దీక్ష లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని అదే విధంగా కోవిడ్ వైద్యశాలలో చికిత్స అందజేయడం ప్రభుత్వం విఫలమైందని తక్షణమే మెరుగైన వైద్యసేవలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నిరసన దీక్ష లో తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పొల్లా నరసింహా యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్, టి యన్ యస్ యఫ్ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, తెలుగు యువత నాయకులు పెమ్మని అల్లూరి సీతారామరాజు, కనకం వెంకట్రావు, ముని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు