రాజీ మార్గమే రాజ మార్గం

రాజీ మార్గమే రాజ మార్గమని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ యు సుధాకర్ రావు అన్నారు .

శనివారం నాడు మండలంలోని తలమల్ల సచివాలయం నందు పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి భార్గవి ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు లో ఆమె మాట్లాడుతూ ప్రతి పౌరుడూ భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని ప్రతి వ్యక్తికీ జీవించే హక్కు, సమానత్వపు హక్కు ఉందని, వాటికి భంగం కలిగినప్పుడు కోర్టును ఆశ్రయించాలని తెలిపారు.

నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత విజ్ఞానాన్ని పెంచుకునేందుకు వినియోగించాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించ వద్దని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, తలమల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ వెంకట సుబ్బమ్మ , న్యాయవాదులు బొడగిరి వెంకటేశ్వర్లు, శైలజా మరియు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు