సినీ ఫక్కీలో బట్టల దుకాణంలో చోరీ

పొదిలి పట్టణ పెద్ద బస్టాండ్ లోని బట్టల దుకాణంలో నందు మంగళవారం నాడు చోరీ సంఘటన చోటుచేసుకుంది

పోలీసుల కధనం ప్రకారం స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్లో ఉన్న బట్టల దుకాణం నందు మర్రిపూడి మండలం అయ్యపురాజు పాలెం చెందిన వారు బట్టలు కొనుగోలు చేసేందుకు రాగా వారి వెనుక మరో కొందరు వచ్చి ఒక లంగా ను కొనుగోలు చేసి తదుపరి ప్రక్కన ఉన్న కోనుగోలుదారుల బ్యాగ్ ను కోసి అందులో నుంచి ఒక ఎటిఎం కార్డు రెండు ఉంగరాలు కమ్మలు చోరీ చేసి అనంతరం స్థానిక ఎటిఎం నందు 18 వేల రూపాయల నగదు విత్ డ్రా చేసినట్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న ‌పొదిలి యస్ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు