పొదిలి మున్సిపల్ పరిధిలోని కంభాలపాడు లో చోరీ

పొదిలి మున్సిపల్ పరిధిలోని కంభాలపాడు గ్రామంలో నందు బుధవారం రాత్రి దొంగతనం సంఘటన చోటుచేసుకుంది.

బాధితురాలు నాగిరెడ్డి నారాయణమ్మ కధనం ప్రకారం ఇంటికి తాళం వేసి ప్రాంగణంలో రాత్రి నిద్ర పోగా తెల్లవారుజామున లేచి చూడగా మంచంపైన ఉన్న దిండు కింద ఉన్న తాళాలు లేకపోవడం ఇంటి తలుపులు తెరిచి ఉండటం
లోపల ఉన్న వస్తువులు చిందరవందరగా ఉండటం బీరువా లో ఉన్న సుమారు11 సవర్ల బంగారం, 4వేలు నగదు కనిపించక పోవటం చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించామని విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనంతరం ఒంగోలు నుంచి వేలిముద్రల నిపుణులు బృందం సంఘటన స్థలానికి చేరుకొని సంబంధించిన వేలిముద్రలను సేకరించారు.