పొదిలి బ్యాంక్ కాలనీ లో నందు దొంగతనం
పొదిలి బ్యాంక్ కాలనీ లోని ఒక నివాస గృహంలో దొంగతనం సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణం విశ్వనాధపురం బ్యాంకు కాలనీ లోని నివాస గృహము నందు ఇంటి లో ఎవరు లేని సమయంలో దొంగతనం జరగటం తో శుక్రవారం ఉదయం చుట్టు పక్కల వారు గమనించి ఇంటి యజమానికి సమాచారం అందించగా హుటాహుటిన ఇంటి యజమాని లక్ష్మి నారాయణ తన నివాస గృహానికి చేరుకొని దొంగతనం విషయాన్ని స్ధానిక పోలీసులకు సమాచారం అందించారు.
సదరు దొంగతనం సంఘటన జరిగిన నివాసం గృహంలో 80 వేలు నగదు 3 సవర్ల బంగారం చోరీ జరిగినట్లు తెలిపారు