అక్రమ ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు స్వాధీనం ముగ్గురి అరెస్టు

పొదిలి పట్టణంలోని మర్రిపూడి క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తనిఖీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

మండలం పరిధిలోని తలమళ్ల గ్రామంలో నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను ట్రాక్టర్లు ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారని రాబడిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి మూడు ట్రాక్టర్లును ముగ్గురు వ్యక్తులు పై కేసు నమోదు చేసినట్లు యస్ఐ శ్రీహరి తెలిపారు