మోసం చేసిన కేసులో ముగ్గురు అరెస్టు-సిఐ సుధాకర్ రావు
తరుగు లేకుండా బంగారు ఆభరణాలు తయారు చేసి ఇస్తామని నమ్మించి మోసం చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సిఐ సుధాకర్ రావు తెలిపారు.
శుక్రవారం నాడు స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ ఒంగోలు గ్రామానికి చెంది పొదిలి నందు గత ఏడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఏల్చూరి మురళీధరరావు, ఏల్చూరి విజయ్ కుమార్, ఏల్చూరి శిరీష అనే ముగ్గురు పొదిలి పట్టణం విశ్వనాథపురం లోని ఆంజనేయస్వామి స్వామి గుడి ఎదురు “సిరి జువెల్లర్స్ ” అని బంగారం షాప్ పెట్టుకొని జీవించుచున్నారు. . బంగారం షాప్ లో సరిగా పనిలేకపోవడంతో వీరికి సరియైన సంపాదన లేక చాలా రోజులు నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వీరికి బంగారం పని తప్ప ఏ పని రానందున ముగ్గురు కలిసి బంగారం పని మీద తక్కువ సమయంలో ఎక్కువగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని తరుగు లేకుండా బంగారం పని చేయబడును అని జనాలకు నమ్మకంగా మాయమాటలు చెప్పి కొంత మందికి తరుగు లేకుండా బంగారం . వస్తువులు చేసి ఇచ్చినారు. ఈ విధంగా జనాలను నమ్మించి, ఇది తెలిసి చాల మంది నెల్లూరు, విజయవాడ, గుంటూరు, వినుకొండ లకు చెందిన బంగారు ఆభరణాల తయారు. చేసి అమ్మే వ్యాపారస్తులు ముద్దాయిలను నమ్మి కొత్త బంగారం వస్తువులు కొరకు పాత బంగారం వస్తువులు వీరి షాప్ కు వచ్చి వేసినారు వీరు సేకరించిన బంగారానికి మరియు తీసుకున్న డబ్బులకు స్లిప్ ల మీద వ్రాసి ఇచ్చేవారు. కొంత మందికి నమ్మకం మీద స్లిప్ లు కూడా వ్రాసి ఇవ్వలేదు .ది. 24.12.2021 న ముగ్గురు సేకరించిన బంగారం, వెండి మరియు డబ్బులతో ఇంటికి మరియు షాప్ కు తాళాలు వేసి పారి పోయినారు. ముద్దాయిలు మొత్తం సుమారు 2644.58 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 25. 97 వెండి ఆభరణాలు మరియు రూ 22,28,800 నగదు జనాల నుండి వసువులు చేయడం జరిగిందని సిఐ సుధాకర్ రావు తెలిపారు.
ఈ విలేకర్ల సమావేశంలో పొదిలి యస్ ఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు .