నాటుసారా అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు పొదిలి యస్ఐ శ్రీహరి తెలిపారు.
వివరాల్లోకి వెళితే రాబడిన సమాచారం మేరకు మంగళవారం నాడు మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు నిర్వహించగా ఎపి 26 టికె 1931ఆటో నందు కొనకనమీట్ల మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన రావుల చిన్న వెంకటేశ్వర్లు, రావుల శ్రీను మర్రిపూడి మండలం దోసపాటి శ్రీను అను వారు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్లు నాటుసారాను స్వాధీనం చేసుకొని ఆటో ను సీజ్ చేసి వారి ముగ్గురిని అరెస్టు చేసినట్లు యస్ఐ శ్రీహరి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన విడుదల చేశారు