అదుపుతప్పిన ద్విచక్ర వాహనం…. ముగ్గురికి తీవ్రగాయాలు

ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న హెచ్చరిక బోర్డును ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే కొనకనమీట్ల  మండలం బచ్చలకురపాడు గ్రామానికి చెందిన మార్టిన్, ధనరాజ్, ఎజెక్సన్ లు ద్విచక్ర వాహనంపై బచ్చలకురపాడు నుండి కొనకనమిట్ల వెళ్లే క్రమంలో కొనకనమిట్ల మండలం చెర్లోపల్లి గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న హెచ్చరిక బోర్డును ఢీకొని మార్టిన్, ధనరాజ్ ల కాళ్ళకు తీవ్ర గాయాలు కాగా ఎజెక్సన్ చేతికి తీవ్ర గాయం కావడంతో……

సమాచారం అందుకున్న 108సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పొదిలి  ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా….. ప్రాధమిక చికిత్స అందించి మెరుగైన వైద్యంకోసం ఒంగోలుకు తరలించారు.