తులసి విత్తనాల పేరుతో మోసపోయిన రైతులు ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయండి…. దరిశి డియస్పీ నాగరాజు సూచన
తులసి విత్తనాల పేరుతో మోసపోయిన రైతులు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని దరిశి డియస్పీ కె నాగరాజు పొదిలి టైమ్స్ ద్వారా రైతులకు సూచించారు. వివరాల్లోకి వెళితే అద్దంకి ప్రాంతంలో జై కిసాన్ అనే దొంగ కంపెనీ పేరుతో తులసి విత్తనాలు 100 గ్రాములు 1500 వందల రూపాయలకు విక్రయించి పంట వచ్చిన తరువాత తామే కొనుగోలు చేస్తామని చెప్పి సుమారు 12వందల మందికి పై చిలుకు రైతులకు తులసి విత్తనాలు విక్రయించడం జరిగిందని పంట చేతికి వచ్చిన అనంతరం విక్రయించినవారు అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చి కొంత మంది రైతులు ఫిర్యాదు చెయ్యగా వాటిపై నాలుగు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేశామని ఈ మోసానికి గిద్దలూరుకు చెందిన బోదనబోయిన శ్రీరంగ శ్రీనివాస్ ప్రధాన వ్యక్తి కాగా సహాయ కర్తలుగా హైదరాబాద్ కాచిగూడకు చెందిన షేక్ మహ్మమద్, అసమరాకె, ఒక హర్టికల్చర్ అధికారి, మరికొందరు సహకరించినట్లు ప్రాధమిక దర్యాప్తులో తెలిసిందని అతను ఈరోజు అద్దంకి కోర్టులో లోంగిపోవడం జరిగిందని అతనిని పోలీస్ కస్టడీలోకి తీసుకొని పూర్తి స్ధాయిలో విచరించి నష్టపోయిన రైతులను అదుకుంటామని ఇంకా ఎవరైనా మోసపోయిన రైతులు ఉంటే సంబంధిత పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని అన్నారు.