యువతి అనుమానాస్పద మృతి
పొదిలి పట్టణంలోని స్థానిక టైలర్స్ కాలనీలో నివాసం ఉండే వేముల అంకమ్మ(19) అనే యువతి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త సాయి చిన్నబస్టాండ్ సెంటర్ లో ఓ జిరాక్స్ నడుపుతున్నాడు. సాయి తెలిపిన వివరాల మేరకు ఉదయం తన జిరాక్స్ సెంటర్ కి వెళ్లిన సాయి మధ్యాహ్నం 12:30నిమిషాల సమయంలో భోజనం చేయడానికి ఇంటికి వచ్చి చూడగా తన భార్య ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించాడు. తనకి పెళ్లై 8నెలలు అవుతుందని ఇంతవరకు ఎలాంటి గొడవలు లేవని ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో అర్ధం కావట్లేదు అని తెలిపాడు. మృతురాలి తల్లి మాత్రం తమ కుమార్తె మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. సమాచారం అందుకున్న రెవిన్యూ మరియు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తహశీల్దార్ విద్యాసాగారుడు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెవిన్యూ మరియు పోలీసు సిబ్బంది పంచనామా నిర్వహించారు.మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా కార్యక్రమంలో తహశీల్దార్ విద్యాసాగారుడు, సిఐ శ్రీనివాసరావు, ఆర్ఐ సుబ్బరాయుడు, విఆర్ఓ లు మురళి, సుబ్బారావు, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.