టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి….
టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక పెద్ద బస్టాండ్ సమీపంలో నడిచి వెళుతున్న జక్కిరెడ్డి సుబ్బారెడ్డి (55) అనే వ్యక్తిని గుర్తు తెలియని టిప్పర్ ఢీకొనడంతో
తీవ్రంగా గాయపడగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించగా అత్యవసర వైద్యసేవలకోసం గుంటూరు తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీరామ్ వైద్యశాల చేరుకుని సంఘటన జరిగిన తీరు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.