గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పొగాకురైతులు రాస్తారోకో
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పొగాకు రైతులు రాస్తారోకో నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే సోమవారంనాడు ఉదయం స్ధానిక ఒంగోలు – కర్నూలు రహదారిపై బైఠాయించిన పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవడంలో అధికారులు విఫలయ్యారని తక్షణమే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న పొదిలి ఎస్ఐ శ్రీరామ్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.