పొగాకు బ్యారన్ దగ్ధం 6లక్షల ఆస్తి నష్టం
పొగాకు బ్యారన్ దగ్ధమై సుమారు 6లక్షల ఆస్తినష్టం జరిగిన సంఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది.
వివరాలుల్లోకి వెళితే పొదిలి మండలంలోని అక్కచెరువు గ్రామంలో గొంటు కోటేశ్వరరావుకు చెందిన పొగాకు బ్యారన్ పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు 6లక్షల రూపాయల విలవచేసే ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు అంచనా వేశారు.
స్థానికులు సమాచారంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేలోగా బ్యారన్ పూర్తిగా దగ్ధం కావడంతో అగ్నిప్రమాదం జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక తయారు చేసినట్లు సమాచారం.