నేడు కొత్తగా 22 కోవిడ్ కేసులు నమోదు ఇద్దరి మృతి
8 మంది ఇంటికి చేరిక
వివరాల్లోకి వెళితే ఒంగోలు కోవిడ్ వైద్యశాల శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ నందు పొదిలి పట్టణానికి చెందిన 22 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రకటించారు. ఒంగోలు కోవిడ్ వైద్య శాల నందు చికిత్స పొంది కొలుకున్న 8 మంది ఇంటికి చేరారు.
ఒంగోలు కోవిడ్ వైద్యశాల నందు చికిత్స పొందుతూ నేడు ఒక్కరు చనిపోగా పట్టణంలో ఒక మహిళ మృతి చెందటంతో కోవిడ్ అనుమానం తో పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది ఈ మృతులుతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది