జగనన్న ఇంటి నిర్మాణాలకు రేపటి శంకుస్థాపనలు
పొదిలి పట్టణంలో జగనన్న ఇంటి నిర్మాణాలకు జూలై 1,3,4 తేదీలో శంకుస్థాపనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ను పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ రావు పరిశీలించారు.
ఇక్కడ ఇంటి నిర్మాణం జరుపుకోనే వారికి ఇసుక, సిమెంట్, ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా అందుబాటులో ఉంటాయని లబ్ధిదారులు త్వరపడి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలిపారు.
సదరు లే ఔట్ నందు తో ప్రోక్లెన్ తో శంకుస్థాపన గుంతలు తీసే ప్రక్రియను వేగవంతం చేసారు
ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ వార్డు సచివాలయల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు