ట్రాక్టర్, తుఫాను వాహనాలు ఢీకొని ఒకరు మృతి…. ఇద్దరి పరిస్థితి విషమం….మరో ముగ్గురికి గాయాలు
పొదిలి మండలం మల్లవరం గ్రామం వద్ద ట్రాక్టర్, తుఫాను వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణానికి చెందిన ప్రధమ చికిత్స వైద్యులు మోహన్ రావు తను కూతురి పెండ్లి సందర్భంగా పెళ్ళి వస్తువులు కొనుగోలు నిమిత్తం తుఫాను వాహనంలో నరసరావుపేట వెళ్ళి తిరిగి వస్తుండగా మల్లవరం గ్రామం సమీపంలోని పవర్ఆఫీసు వద్ద రోడ్డుపై చిల్లకర్రలోడుతో ఆగి ఉన్న ట్రాక్టరును వెనుక వైపు నుండి తుఫాను వాహనం ఢీకొనడంతో తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న కెవి మోహన్ రావు (52) అక్కడికక్కడే మృతిచెందగా మృతుని కుమార్తెలు శాంతిలక్ష్మి (సాయి) (22), సుప్రియ(14)ల పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన ఒంగోలుకు తరలించారు. అనంతరం మృతుడు భార్య నరసమ్మ(40), వదిన అచ్చమ్మ(42) తుఫాను డ్రైవర్ జాకీర్ హుసేన్ (38) తీవ్రంగా గాయపడడంతో వారిని కూడా మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.