ట్రక్కును ఢీకొన్న బైక్ ఇద్దరికి గాయాలు…..
ట్రాక్టర్ ట్రక్కును బైకు ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతగంపల్లి గ్రామానికి చెందిన యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఇర్మీయా లు బైకుపై పొదిలి నుండి చింతగంపల్లి వెళ్తుండగా అగ్రహారం గ్రామ సమీపంలో రోడ్డుపై నిలిపిఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్నారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా మరొకరు సల్పంగా గాయపడ్డారు. అదే మార్గంలో వస్తున్న పొదిలి ఎస్ఐ శ్రీరామ్ ప్రమాదాన్ని గమనించి తన వాహనంలో పొదిలిలోని ఓ వైద్యశాలకు తరలించారు.