కోవిద్ నియంత్రణకు గ్రామ నిర్వహణ కమిటీలు సమిష్టిగా పని చేయాలని పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ కృష్ణ అన్నారు.
వివరాల్లోకెళ్తే శుక్రవారంనాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు రెండు విడతలుగా 16 గ్రామ పంచాయితీలకు సంబంధించిన గ్రామ నిర్వహణ కమిటీలకు ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగినది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపిడిఓ శ్రీ కృష్ణ మాట్లాడుతూ జ్వరాల సర్వేలో పాజిటివ్ వచ్చిన వారికి హాస్పటల్ వెళ్లే లాగా చూడాలని కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని ఐసోలేషన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని విలేజ్ మేనేజ్మెంట్ కమిటీ లు సమిష్టిగా పనిచేసి కోవిడ్ నియంత్రణకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ రాజశేఖర్, మండల పరిధిలోని సర్పంచ్ లు మరియు కార్యదర్శులు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు