మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలకు సత్కారం
వివరాల్లోకి వెళితే స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతనతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.
ముఖ్య అతిథిగా పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయముర్తి భార్గవి హాజరైయ్యారు
ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ రంగాలలో ప్రతిభ కనపర్చిన మహిళలను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో దోర్నాల వరమ్మ, డాక్టర్లు సానికొమ్ము ప్రత్యూష, షేక్ షాహిదా , తహశీల్దారు చంద్రావతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోటేశ్వరి, మాజీ ఎంపిటిసి సభ్యులు గునుపూడి మాధవి, మాజీ పంచాయతీ పాలకవర్గ సభ్యులు షేక్ నూర్జహాన్, ముల్లా మీరాబీ మహిళా నాయకురాలు సోమిశెట్టి శ్రీదేవి ఎంబిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెట్లూరి బాదుల్లా తదితరులు పాల్గొన్నారు