బిసి కమిషన్ ఛైర్మన్ కు సత్కారం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
బిసి ఈ సామాజిక వర్గం లో ముల్లా ఇంటి పేరు వారిని చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ బిసి కమిషన్ ఛైర్మన్ విశ్రాంత న్యాయమూర్తి శంకర్ నారాయణ్ ను పొదిలి పట్టణం చెందిన ముల్లా కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు.
వివరాల్లోకి వెళితే గురువారం నాడు మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పొదిలి పట్టణం చెందిన ముల్లా కుటుంబ సభ్యులు విజయవాడలోని బీసీ కమిషన్ కార్యాలయం నందు చైర్మన్ విశ్రాంత న్యాయమూర్తి శంకర్ నారాయణ ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముల్లా హాసన్ అలీ, ముల్లా షరీఫ్, ముల్లా జాకీర్, ముల్లా సంధాని, ముల్లా ఫయాజ్, ముల్లా భాషా, ముల్లా మన్సుర్
పొదిలి మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గొలమారి చెన్నారెడ్డి మరియు ముల్లా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.