ఎంఎల్ఏ కుందూరు ఆధ్వర్యంలో వాలంటీర్లు కు సన్మానం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు ఘనంగా సన్మానించారు.
వరాల్లోకి వెళితే పొదిలి మండలం మల్లవరం గ్రామం నందు మల్లవరం,ఆముదాలపల్లి , సూదనగుంట,కంచేపల్లి,పాములపాడు గ్రామ పంచాయతీల వాలంటీర్లుకు తలమల్ల గ్రామంలో తలమల్ల, ఉప్పలపాడు, ఏలూరు, గ్రామ పంచాయతీ చెందిన వాలంటీర్లుకు సేవా పురస్కారాలను అందించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథి మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవాలు మరువలేనివి అని కొనియాడారు.
అనంతరం ఉత్తమ ప్రతిభ చూపిన వార్డు గ్రామ వాలంటీర్లు కు సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్రా పురస్కారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకరరావు, తహశీల్దారు దేవ ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి సర్పంచ్లు శిరిమల్లే శ్రీనివాస్ యాదవ్, సుధాకర్ రెడ్డి, రెడ్డిబోయిన సుబ్బారావు, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.