ప్రజాశక్తి నరసింహారావు కు ఘన నివాళులు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

దివంగత ప్రజాశక్తి దినపత్రిక పాత్రికేయుడు నరసింహారావు కు ఘనంగా నివాళులర్పించారు.

ఆదివారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ప్రజాశక్తి పాత్రికేయులు నర్రా వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన సంతాపం సభలో పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పలువురు ప్రముఖులు పాత్రికేయులు నరసింహారావు చిత్రం పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నరసింహారావు సేవాలను గురించి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు, మండల పరిషత్ అధ్యక్షులు మురళి కృష్ణ యాదవ్, సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ హనీఫ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హనిమూన్ శ్రీనువాసులరెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి,జి శ్రీనివాసులు,గొలమరి చెన్నారెడ్డి,‌దర్నాసి రామారావు, తెలుగు దేశం పార్టీ నాయకులు ముల్లా ఖూద్దుస్ సయ్యద్ ఇమాంసా , సిపిఎం నాయకులు ఎం రమేష్ మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు