అయోధ్య రామాలయం నిర్మాణం కోసం ” శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ” ఏర్పాటు
అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణం కోసం ట్రాస్ట్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆర్ -20, గ్రేటర్ కైలాష్ పార్ట్ -1, కొత్త డిల్లీ, 110048, కార్యాలయం చిరునామాతో ” శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ” ట్రస్ట్ రిజిస్టర్ చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసినట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నాడు పార్లమెంటులో ప్రకటించారు.