ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు… ఒకరికి గాయాలు

పొదిలిలోని స్థానిక మర్రిపూడి అడ్డరోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన బుధవారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే మర్రిపూడి గ్రామానికి చెందిన చిట్టిబోయిన సుబ్బారావు పొదిలిలోని తన పనులు చూసుకుని తిరిగి మర్రిపూడి వెళ్లే క్రమంలో మర్రిపూడి అడ్డరోడ్డుకు చేరుకోగానే ఫోర్డ్ కారు అజాగ్రత్తగా, అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో తలకు గాయాలైనట్లు సుబ్బారావు భార్య విజయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొదిలి ఎస్ఐ సురేష్ తెలిపారు.