ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాల ఢీ… ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బుధవారంనాడు రాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండలం అగ్రహారం వద్ద పొదిలి మండల పరిధిలోని ఒంగోలు-కర్నూలు జాతీయ రహదారిపై కెల్లంపల్లికి చెందిన గుంజా అశోక్ (23), ఈసంపల్లి బాషా, ఫణిదపు నాగభూషణం ద్విచక్రవాహనంపై కెల్లంపల్లి వెళ్లేందుకు రోడ్డుమలుపు తిరుగుతుండగా…..
అదే సమయంలో ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఉలవా వెంకటస్వామి (24) ద్విచక్రవాహనంపై వస్తుండగా అగ్రహారం వద్దకు రాగానే రోడ్డుమలుపు తిరుగుతున్న వారిని గమనించకపోవడంతో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని గుంజా అశోక్, ఉలవా వెంకటస్వామిలు అక్కడికక్కడే మృతిచెందగా….. గాయపడిన ఈసంపల్లి బాషా, ఫణిదపు నాగభూషణం లకు తీవ్రగాయాలు కావడంతో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం ఫణిదపు నాగభూషణంను ఒంగోలుకు తరలించారు.
విషయం తెలుసుకున్న పొదిలి సిఐ శ్రీరామ్, పొదిలి ఎస్ఐ సురేష్, మర్రిపూడి ఎస్ఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పొదిలి ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.