రెండు ద్విచక్ర వాహనాలు ఢీ… ముగ్గురికి గాయాలు… ఇద్దరి పరిస్థితి విషమం
రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ముగ్గురు గాయపడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మర్రిపూడి క్రాస్ రోడ్డు వద్ద ఒంగోలు-కర్నూలు రహదారిపై పొదిలి ఆర్టీసీ డిపో డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్న కె ప్రసాద్ బాబు విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై ఒంగోలుకు వెళుతుండగా……. అమరావతి నుండి కడపజిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తున్న కడపజిల్లా వాసి శ్రీను, రవిలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడగా శ్రీను, రవిల పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడిన డ్రైవర్ ప్రసాద్ బాబును స్ధానిక ఆర్టీసీ కార్మికులు ఒంగోలుకు తరలించగా మిగిలిన ఇద్దరిని స్ధానికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.