సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగనన్న

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

అమదలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సిరిమల్లె శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు.

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం సోమవారం నాడు అమదలపల్లి గ్రామం నందు ఇంటి ఇంటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు