సైబర్ క్రైమ్ గంజాయి పై అవగాహన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

సైబర్‌ నేరాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని పొదిలి సిఐ టి వెంకటేశ్వర్లు సూచించారు. సైబర్‌ నేరాలు, ట్రాఫిక్ , భీమా, గంజాయి లపై పొదిలి పోలీసుల ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.

గురువారం నాడు పొదిలి జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్‌ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్‌ నేరాలు, క్రెడిట్‌ కార్డ్స్‌ సంబంధిత మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలు, అడ్వరె్టైజ్మెంట్‌ ఫ్రాడ్స్‌, లోన్‌యాప్‌ లు, ఓటీపీ, సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌, సైబర్‌ ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930పై వివరించారు.

యస్ఐ వేమన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్టవేయడం, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం, తదితర అంశాలపై వివరించారు

ఈ కార్యక్రమంలో పొదిలి జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు