గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహన చోదకుడికి తీవ్ర గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహన చోదకుడు తీవ్ర గాయాలపాలైన సంఘటన శనివారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి మండలంలోని తలమళ్ల గ్రామానికి చెందిన జగన్నాథం వెంకటేశ్వర్లు తన అత్తగారి ఊరైన రాచర్ల మండలం పాలకీడు గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా…… కొనకనమిట్ల మండలం గొట్లగట్టు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని కాలు విరగడంతో సమాచారం అందుకున్న 108సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.