ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం: కుప్పం

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు.

వివరాల్లోకి వెళితే గురువారంనాడు
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ డిగ్రీ కళాశాల పాలకవర్గ సభ్యులు గునుపూడి చెంచు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 46వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానం మరియు నైతిక విలువలతో పాటు క్రీడలు వివిధరకాల కళలలో నైపుణ్యం కలిగి ఉండడమే కాకుండా అన్ని రంగాలలో అవగాహన కలిగి ఉండడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చునని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, మర్రిపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామాచారి, డిఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ వేల్పుల కృష్ణంరాజు తదితరులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యార్థి దశలో కలిగి ఉండవసిన నైపుణ్యాలను, సూచనలు సలహాలు అందజేశారు.