కంటి పరీక్ష వైద్య శిబిరం ను ప్రారంభించిన యస్ ఐ నాగరాజు 300 మందికి వైద్య పరీక్షలు కళ్ళజోడు పంపిణీ
పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామం నందు ఉప్పలపాడు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాధమిక ఉన్నత పాఠశాలలో ఎస్సై సుబ్బారావు గారి స్పూర్తితో సహాకరంతో ఏర్పాటు చేసిన
కంటి వైద్య శిబిరం ని పొదిలి ఎస్సై నాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సహకారంతో గ్రామంలోని పేదలకు ఉచిత కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేయటం శుభపరిమణంని అన్నారు . ఈ కార్యక్రమంలో ఉచిత కంటి పరీక్షలతో పాటు మందులు, కళ్లజోళ్లు కూడా పంపిణీచేసిన యూత్ వారిని అభినందించారు.ఈ కార్యమంలో వైద్యసేవలందించిన చీరాల GK కంటి వైద్యశాల సిబ్బందికి నిర్వకులు మువ్వ సాయికృష్ణ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఉచిత కంటి వైద్యశిబిరం లో సుమారుగా 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసి 150 మందికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బండారు శివకుమార్ యాదవ్ యడవల్లి పవన్ మనపల్లి గోపి రాయల శివ ఎక్కంటి ప్రతాప్ చింతగుంటల ఏడుకొండలు సురా లక్ష్మీరెడ్డి నూతలపటి అంజి మనపల్లి చిన్న గోపి చీర్ల వాసు జెడే వెంకటేష్ దొడ్డి హర్ష గురక పవన్ తదితరులు పాల్గొన్నారు