నల్లమల యురేనియం ఆపాలని జనసేన రౌండ్ టేబుల్ సమావేశం
యురేనియం నిక్షేప తవ్వకాల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరణ చేసుకుని నల్లమలను పరిరక్షించాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని దస్పల్లా హోటల్ నందు సోమవారంనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీల ప్రతినిధులందరు ఏకగ్రీవంగా నల్లమలలో యురేనియం తవ్వుకాలు నల్లమలలో నిలిపివేయాలని తీర్మానించారు . భవిష్యత్తు కార్యచరణ త్వరలో ప్రకటిస్తామని హాజరైన నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు విహెచ్ హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవంత్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకులు రమణ, తెలంగాణ జనసమితి నాయకులు కోదండరామ్, సిపిఐ నాయకులు చాడా వెంకటరెడ్డి, సిపియం, ఎంఐఎం మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.