150కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన వడ్డే మోమెరియల్ ట్రస్ట్
వడ్డే నరసయ్య మెమోరియల్ ట్రస్ట్ తరఫున 150కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే స్థానిక నేతపాలెం నందు శనివారంనాడు వడ్డే నరసయ్య మెమోరియల్ ట్రస్ట్ నిర్వహకులు వడ్డే వెంకటరావు 5కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు మరియు కూరగాయలు మాస్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను పుట్టి పెరిగి విద్యాభ్యాసాన్ని పొందినటువంటి నేతపాలెంలో కరోనా వైరస్ లాక్ డౌన్ వలన ఎవరూ ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో వడ్డే నరసయ్య మెమోరియల్ ట్రస్టు తరఫున ఈ నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని……. భవిష్యత్తులో నేతపాలెంలోని వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ ఆపద వచ్చినా తన వంతు సహాయంగా ముందుకు వస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో వడ్డే ప్రకాష్, వడ్డే రాజు, వడ్డే వేణు, పావులూరి భాను ప్రసాద్, కూకట్లపల్లి భాస్కర్ రావు, బండి అశోక్ మరియు నేత పాలెంయూత్ తదితరులు పాల్గొన్నారు.