వైభవంగా జ్వాలాతోరణం కార్యక్రమం

కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక పొదిలి శివాలయం నందు వైభవంగా జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు.

గురువారం నాడు స్థానిక పొదిలి పట్టణంలో శివాలయం నందు సామి వెంకట పద్మావతి సౌజన్యంతో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.

గత మూడు సంవత్సరాలుగా జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్ మరియు వేలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు