వైభోగంగా మాదలవారిపాలెం వారి పాలెం తిరుణాళ
పొదిలి నగర పంచాయితీ లోని మాదాలవారిపాలెం లో హాజరత్ నాసర్ వలి దర్గ గంధమహోత్సవం తీరుణాళ వైభవంగా జరిగింది.
గత రెండు సంవత్సరాల తర్వాత నిర్వహించిన తిరుణాళ కావటంతో వేలాదిమంది ప్రజలు తరలివచ్చి తమ యొక్క మొక్కులను తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
భక్తులకు వినోదం పెంచటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 తెలుగు దేశం పార్టీ 1 ప్రభును మొత్తం మూడు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు