వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన దేవాలయాలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పట్టణంలోని వేణుగోపాలస్వామి, వెంకటేశ్వరస్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
వివరాల్లోకి వెళితే సోమవారంనాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామునుండే భక్తులు అధికసంఖ్యలో వేణుగోపాలస్వామి, వెంకటస్వామి ఆలయాలలో క్యూ కట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉత్తరద్వారం గుండా లోనికివెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.