30 అడుగుల రుద్రాక్ష శివలింగాన్ని సందర్శించిన వాకా బొరిగొల్ల
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరమ శివునికి ప్రీతికరమైన రుద్రాక్ష సేవ చేసేందుకు 30 అడుగుల పంచముఖి రుద్రాక్ష సహిత మహా శివలింగాన్ని శాస్త్రోక్తంగా పొదిలికి చెందిన కామ్య రుద్రాక్ష ఆధ్యాత్మిక సేవ సమితి వ్యవస్థాపకులు పగడాల మల్లికార్జున రావు ప్రతిష్టించినటువంటి మహా శివలింగాన్ని మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి, దొనకొండ మండల పరిషత్ అధ్యక్షులు బొరిగొల్ల మురళి యాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామి వారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు