వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి : అఖిల భారత యాదవ మహాసభ
నవంబర్ 25వ తేది ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని దర్శి రోడ్డులోని స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి డిగ్రీ కళాశాలలో ప్రాంగణంలో ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు జరుగుతుందని అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి, మాజీ జడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ, మాజీ పార్లమెంట్ సభ్యులు చిమట సాంబు, మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు, ముద్రబోయిన వెంకటేశ్వర రావు, యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిలు మాలకొండయ్య యాదవ్, తులసీ రామ్ యాదవ్, వివిధ రంగాలకు చెందిన యాదవ ప్రముఖులు తదితరులు పాల్గొంటారని కావున జిల్లాలోని యాదవులు తప్పక పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బంకా చిరంజీవి, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, జిల్లా కార్యదర్శిలు మూరబోయిన బాబూరావు యాదవ్, బత్తుల వెంకటేష్ యాదవ్, పొదిలి మండల నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, పొల్లా నరసింహ యాదవ్, బాలగాని నాగరాజు, సన్నెబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.