వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఎస్ఐ సురేష్
వనం-మనం కార్యక్రమంలో భాగంగా పొదిలి ఎస్ఐ సురేష్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
వివరాల్లోకి వెళితే దర్శి రోడ్డులోని కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్ఐ సురేష్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమని….. నేటి పరిస్థితులలో వాతావరణ సమతుల్యత లేకపోవడానికి కారణం చెట్ల నరికివేయడమే అని పౌరులందరూ విధిగా మొక్కలునాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.