వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభించిన నియోజకవర్గ ప్రత్యేకాధికారి
వనమహోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రత్యేకాధికారి రుఖ్ముద్దీన్ ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే మండల పర్యటనలో భాగంగా పాములపాడు పంచాయతీలో పర్యటించిన నియోజకవర్గ ప్రత్యేకాధికారి రుఖ్ముద్దీన్ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా చితాంబరంపల్లి – కాశిపురం రహదారికి ఇరువైపులా మొక్కలునాటే కార్యక్రమాన్ని మొక్కలునాటి ప్రారంభించారు. అనంతరం చితాంబరంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాములపాడు పంచాయతీలో గ్రామ వాలంటీర్ల బేస్ లైన్ సర్వేను తనిఖీ చేసి సలహాలు సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, పంచాయతీ రాజ్ విస్తరణ అధికారి రాజశేఖర్ మరియు వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.