వారంలో అన్న క్యాంటీన్ పనులు ప్రారంభం…..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అన్నక్యాంటీన్ల పథకం పొదిలి గ్రామ పంచాయతీ స్థానిక పెద్దబస్టాండ్ నందు ఎంపిక చేసిన ప్రదేశంలో వారంలో పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. స్ధానిక పెద్ద బస్టాండ్ నందు 50 ×50 మీటర్లు స్ధలంలో నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లను చీమకుర్తి నగర పంచాయతీ ఎఈ అంకాలింగం సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ అధికారులకు వారంలో స్ధలం స్వాధీనం చేస్తే పనులు ప్రారంభం చేస్తామని ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగా అన్నక్యాంటీన్ల నిర్మాణం పూర్తి చేస్తామని తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల పంచాయతీ రాజ్ విస్తరణ అధికారి రంగనాయకులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.