వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్ధంతి….

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 71వ వర్ధంతి స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ అమరహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవిక్లబ్ రీజన్ చైర్మన్ సోమిశెట్టి చిరంజీవి, రావూరి సుబ్బరాయుడు, యాదాల సుబ్బారావు, రావూరి ప్రసాద్, పండిటి సునీల్, ప్రెసిడెంట్ లు తాత హరిత, తాత రాము జి.యస్.ఆర్, పమిడిమర్రి కృష్ణ, మునగా సత్యం, పంచాయతీ అధికారులు లక్ష్మీనారాయణ, మారుతిరావు తదితరులు పాల్గొన్నారు.