వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాల ఆవిష్కరణ
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పొదిలి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు వాసవిక్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు వేముల హజరత్తయ్య గుప్తా ఆవిష్కరించారు.
వివరాల్లోకి వెళితే తొలుత స్థానిక పెద్దబస్టాండ్ సెంటర్ నుండి విద్యార్థులు, వాసవి క్లబ్ సభ్యులు ర్యాలీగా వచ్చిన అనంతరం ముఖ్యఅతిథి హజరత్తయ్యకు పాఠశాల సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని సరస్వతీదేవి ప్రతిమవద్ద పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను హజరత్తయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ సద్బావన పర్యటనలో భాగంగా పొదిలి రావడం జరిగిందని….. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ సేవా కార్యక్రమాల పర్యటనలో భాగంగా మంగళవారంనాడు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజల అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని…. స్థానిక భవిత పాఠశాలనందు గేటు మెష్ కోసం 12000రూపాయలు విరాళం అందించి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని…. మర్రిపూడి ప్రభుత్వ పాఠశాల నందు వాటర్ ట్యాంకు అలాగే విద్యార్థులకు పుస్తకాలు, మిఠాయిలు పంచడం జరిగిందని….. మాదాలవారిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నందు వాటర్ ట్యాంకు, పుస్తకాలు, మిఠాయిలు పంచిపెట్టామని….. అలాగే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు విగ్రహావిష్కరణ అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి….. గాంధీజీ గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశామని ఇరువురు పేదవారికి ఒకరికి కుట్టు మిషను, ఒకరికి గ్రైండర్ పంపిణీ చేయడం జరిగిందని కార్యక్రమాలను ఇంత చక్కగా నిర్వహించిన వాసవి క్లబ్స్ పొదిలి మండల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ దేసు ప్రసాద్ నాయకులు నారాయణతులసి కందగడ్ల రమణ మగులూరి రామసుధాకర్ సురె ఉమాదేవి సురె చెంచయ్య నాదెళ్ల శ్రీనివాసులు బాదం వెంకటేశ్వర్లు గొంట్లా సురేష్ సోమిశెట్టి శ్రీదేవి సోమిశెట్టి చిరంజీవి యాదాల సుబ్బారావు పందిటి సునీల్ రావూరి ప్రసాద్ మేడా నరసింహారావు గాదంశెట్టి లక్ష్మీ పైడిమర్రి కృష్ణ మునగసత్యం తాతా హరిత సాధు ప్రవీణ్ పందిటి మురళి సామి శ్రీను మాధవి ఒగ్గువెంకట్రామయ్య సోమిశెట్టి శ్రీను సుబ్రమణ్యం పొదిలి క్లబ్ సభ్యులు ప్రధానఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.