సేవాకార్యక్రమాలు విస్తృతం చేయాలి: పాత సుదర్శన్
వాసవి క్లబ్స్ సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని వాసవీ క్లబ్స్ జాతీయ కార్యదర్శి పాత సుదర్శన్ అన్నారు.
వివరాల్లోకి వెళితే స్థానిక వాసవీ సదన్ నందు ఆదివారం నాడు పశ్చిమ ప్రకాశం జిల్లా వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ తొలి సర్వసభ్య సమావేశానికి గవర్నర్ మాగులూరి రామ్ సుధాకర్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ కార్యదర్శి పాత సుదర్శన్ మాట్లాడుతూ వాసవీ క్లబ్స్ నందు పశ్చిమ ప్రకాశం జిల్లాకు చెందిన 207ఎం విభాగం అద్భుతంగా పనిచేస్తు అనేక సేవా కార్యక్రమాలు మరియు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో సంస్థకు సంబంధించిన పలు తీర్మానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో నాదెళ్ల శ్రీనివాస్, సూరె చెంచయ్య, కోట సురేష్, గోళ్ళ వెంకట సుబ్బారావు, బచ్చు శ్రీనివాసులు, సూరే ఉమాదేవి,గోళ్ళ వరలక్ష్మి, సోమిశెట్టి శ్రీదేవి, మేడా నరసింహారావు, పందిటి సునీల్, సాధు ప్రవీణ్, సోమిశెట్టి శ్రీనివాస్, మేడా అనంత శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.