వైభవంగా ఇంటింటికి వాసవి ఉద్యాపణ గ్రామోత్సవం
ఇంటింటికి వాసవిమాత ఉద్యాపణ గ్రామోత్సవం వాసవి క్లబ్స్ మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ప్రతి పట్టణంలో 102గృహాలలో వాసవి అమ్మవారి సేవ చేసుకోవాలనే లక్ష్యంతో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు తలపెట్టిన ఇంటింటికి వాసవి కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో ప్రారంభమై అనంతరం ప్రకాశంజిల్లాకు చేరుకుని కంభం పట్టణంలో కార్యక్రమం అనంతరం పొదిలికి చేరుకుని 200రోజులపాటు 108గృహాలలో విశేషంగా పూజలందుకుని పట్టణంలో ముగింపు కార్యక్రమంగా ఉద్యాపణ మహోత్సవం నిర్వహించారు.
తొలుత కలశ స్థాపనతో కార్యక్రమం ప్రారంభమవగా…..108కలశాలతో 108మంది దంపతులు అమ్మవారి రధోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మంగళవాయిద్యాలతో అమ్మవారి రధోత్సవంలో అమ్మవారు పట్టణ పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. 108కలశాలతో అమ్మవారికి అభిషేకం చేసి గణపతి పూజతో అమ్మవారి పూజను ప్రారంభించి మాహానైవేద్యంతో ముగించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్ హాజరవ్వగా…. పట్టణంలోని ఆర్యవైశ్యులు బంధుమిత్రులను ఆహ్వానించుకుని కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించిన 20మంది వాసవి సేవకులను మెమోంటోలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ మాగులూరి రామసుధాకర్, జిల్లా నాయకులు సోమిశెట్టి చిరంజీవి, సోమిశెట్టి శ్రీదేవి, రావూరి సుబ్బారాయుడు, యాదాల సుబ్బారావు, రావూరి ప్రసాద్, పండిటి సునీల్, పమిడిమర్రి కృష్ణ, జియస్ఆర్, మునగ సత్యం, మామిడి వెంకటేశ్వర్లు, యాదాల వరలక్షమ్మ, మాగులూరి సుధాకర్, రీజన్ చైర్మన్ మేడా నరసింహారావు, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి వేమా కృష్ణమూర్తి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పందిటి మురళి, పొదిలి క్లబ్స్ ప్రెసిడెంట్లు సాధు ప్రవీణ్, పమిడిమర్రి మల్లికార్జున్, ఒగ్గు వెంకట రామయ్య, మేడా అనంత శ్రీనివాసరావు, తాతా హరిత మరియు మర్రిపూడి, కొనకనమిట్ల, గొట్లగట్టు, దర్శి, వాసవి క్లబ్స్ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.