వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంకు 1500 కొట్లు కేటాయించాలి
పొదిలి పెద్ద చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు అనుమతులు మంజూరు చేయాలి
పొదిలి వెలుగొండ ప్రాజెక్టు పనులు కు 1500 కొట్లు ఇచ్చెలా బడ్జెట్ ను మార్చాలని పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో నీటి కష్టాల నుంచి కాపాడాలని అలాగే పొదిలి పెద్ద చెరువు ను సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు అనుమతులు మంజూరు చేసి పొదిలి ప్రాంతంలొని నీటి కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పొదిలి మండల రెవెన్యూ తహాశీల్ధార్ కార్యలయం వద్ద సిపియం ఆద్వర్యం ధర్నా నిర్వహించి డిప్యూటీ తహాశీల్ధార్ జానీ బేగ్ కు వినతి పత్రం అందజేశారు పశ్చిమ ప్రకాశం కరువు కోరల్లో చిక్కుకున్నది ఈ ప్రాంతంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం పొదిలి ప్రాతీయ కమిటీ కార్యదర్శి యం రమేష్ ప్రభుత్వంని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో గంధం నరసింహరావు పి చార్లెస్ డి నర్సయ్య బి చెన్నకెశవులు బి విశ్వ రూపాచారి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు