వెంకటేశ్వరస్వామి ఆలయంకు భూరి విరాళం అందించినా పండు అనిల్
వెంకటేశ్వరస్వామి ఆలయంకు యువ పారిశ్రామిక వేత్త పండు చికెన్ అధినేత పండు అనిల్ 15లక్షల భూరి విరాళాన్ని అందజేశారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయంకు తూర్పు గాలిగోపురం, బంగారు బల్లి , వెండి బల్లి , రాములవారు, సీతమ్మ లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహలకు సంబంధించి ఏర్పాట్లు గాను 15 లక్షల భూరి విరాళాన్ని శనివారంనాడు యువ పారిశ్రామిక వేత్త వరికూటి అనిల్ సతిమణి సురేఖ అందజేశారు.
ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దాతలు వరికూటి అనిల్ ధర్మపత్ని సురేఖలకు దేవస్థాన కమిటీ ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వరికూటి డేవిడ్ నవిన్ కుమార్, ఐశ్వర్య , నిరంజన్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు, యక్కలి శేషగిరిరావు, వెలిశెట్టి నారాయణ, నాగేశ్వరరావు, రావూరి సుబ్బారావు, రావూరి సుబ్రహ్మణ్యం, సురేష్ ప్రధాన అర్చకులు మురళి మరియు బందువులు మీత్రులు తదితరులు పాల్గొన్నారు