ఎరువులు విత్తనాలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిజి ఆదేశాల విత్తన మరియు ఎరువులు తనిఖీల్లో భాగంగా బుధవారం నాడు పొదిలి పట్టణం నందు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

పొదిలి పట్టణంలోని భవాని పెర్టిలైజర్స్‌శ్రీ లక్ష్మి శ్రీనివాస పెర్టిలైజర్స్, శ్రీ వెంకటేశ్వర కాఫీ జనరల్ స్టోర్స్ నందు తనిఖీలు నిర్వహించగా చిన్న చిన్న పొరపాట్లు గుర్తించి సరిచేసుకోవని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంగమేశ్వర రెడ్డి, సిఐ రాఘవ రావు,యస్ఐ వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి షేక్ జైనులబ్దిన్ తదితరులు పాల్గొన్నారు